V6 News

జ్యోతిష్యం :  మే నెలలో భారీగా గ్రహాల కదలికలు.. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది.. 

జ్యోతిష్యం :  మే నెలలో భారీగా గ్రహాల కదలికలు.. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది.. 

గ్రహాల కదలికలు మన జీవిత గమనాన్ని శాసిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 2026 మే నెల ఆరంభం నుంచే గ్రహాల స్థితిగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే  నెలలో బుధుడు, కుజుడు, శుక్రుడు , సూర్యుడు  రాశులు మారుతుండటంతో.. వీటి ప్రభావం సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై, వ్యాపార లావాదేవీలపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం...!

  • మే  1 బుధుడు .. మేషరాశిలోకి
  • మే 11 కుజుడు మేషరాశిలోకి
  • మే 14న శుక్రుడు మిథున రాశిలోకి 
  • మే 15న సూర్యుడు..బుధుడు .. వృషభరాశిలోకి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 మే నెలలో  ముఖ్యంగా నాలుగు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి సంపద పెరగడమే కాకుండా సమాజంలో పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. వృషభ రాశి, కుంభ రాశి, ధనస్సు రాశి, తుల రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

మేష రాశి :  ఈ రాశి వారికి అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. స్థాన చలనం .. అనవసనమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ప్రతి పని కూడా ఆలోచించి చేయాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది.  వ్యాపార విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగస్తులు అనవసర విషయాల్లో తలదూర్చవద్దు.   ముఖ్యంగా ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో  రిస్క్​ తీసుకోకండి. ఆర్థిక విషయాల్లో అప్రతమ్తంగా  ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  

వృషభ రాశి : ఈ రాశి వారికి 2026 మే నెలలో జరిగే గ్రహాల మార్పు వలన కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. రాజయోగం, ధనయోగం ప్రభావంతో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఆదాయం పెరుగుతూ వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గిపోతాయి.ఉద్యోగంలో పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశం లేదా మార్పు అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పనిభారం ఉన్నప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగై మంచి అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగుతుంది.

మిథున రాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అనవసర  ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఆర్థిక ఒత్తిడి,  అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండాలి.ఈ సమయంలో తరచుగా ఆందోళన కలిగే అవకాశం ఉంది. 
తొందరపాటు నిర్ణయాలతో ..  అసహనం వల్ల  నష్టపోయే ప్రమాదం ఉంది. ఏ నిర్ణయమైనా నిదానంగా తీసుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి:  2026 మే నెలలో ఈ రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.  కెరీర్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.  గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తవుతాయి. భాగస్వామ్య బంధాల్లో స్పష్టత అవసరం, లేదంటే అనవసరమైన అపోహలు వచ్చే అవకాశం ఉంది.పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు.  మీ జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.  ఇక వ్యాపారస్తుల విషయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.  ఆర్థిక విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.  చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. 

సింహ రాశి :  కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీసులో మీ ఇమేజ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. భాగస్వామితో నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కెరీర్​ పరంగా.. వ్యాపార పరంగా అంతా మంచే జరుగుతుంది.  సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  2026  మే నెలలో  వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఆర్థికవిషయాల్లో  తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చి పెడతాయి. కొత్తగా విలువైన వస్తువులు ( భూమి,ఇల్లు, వాహనం) కొనుగోలు చేయడం గాని.. అమ్మడం కాని జరుగుతుంది.  నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.  పెళ్లి కోసం ఎదురుచేసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  ప్రేమ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు

కన్యారాశి:  2026 మే నెలలో జరిగే గ్రహాల మార్పు వలన ఈ రాశి వారికి శ్రమతో కూడిన పనులు చేయాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రతి పనిలో  ఓపిక అవసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ప్రతి పనిలో కూడా ఆలస్యం జరుగుతుంది.  ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఏ పని చేయాలో తెలియని పరిస్థితులు  ఉంటాయని పండితులు చెబుతున్నారు.ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకే  గొడవలు వచ్చే అవకాశం ఉంది.  2026 మే నెలలో  ఈ రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. 

తులారాశి:  గ్రహాల అనుకూల సంచారం వల్ల పనిలో మీ స్థానం బలపడుతుంది. జీతం పెరుగుదలతో పాటు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమై విలువైన లాభాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  డబ్బును ఆదా చేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆఫీసులో కీలక పాత్ర పోషించాల్సి రావడంతో బాధ్యతలు పెరుగుతాయి.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.  పెళ్లి.. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.  జీవితం సాఫీగా సాగిపోతుంది. 

వృశ్చికరాశి: 2026 మే నెలలో ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితిలో ఎవరిని నమ్మవద్దు.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న మోసపోయే  అవకాశాలున్నాయి.   ఈ నెల మొదటి వారంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన  కొన్ని  సమస్యలు వస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో  అప్రమత్తంగా ఉండండి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.  రెండో వారంలో పరిస్థితులు కొంతమేర కుదుటపడతాయి.  ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  మీరు మంచి చెప్పినా తప్పుగా అర్దం చేసుకుంటారు. బంధువులు.. స్నేహితులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. మూడు.. నాలుగు వారాల్లో  ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.  ఉద్యోగస్తులకు.. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ప్రతి విషయంలో సీక్రసీని మెయిన్​టైన్​ చేయండి. శత్రువులు కూడా మిత్రులుగా వ్యవహరిస్తారు.  జీవితంలో పురోగతి మరియు లాభం కోసం మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

 ధనుస్సు రాశి:  2026 మే  నెల ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులతో త్వరగా సక్సెస్ అవుతారు. కుటుంబంలో సఖ్యత నెలకుంటుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు.  ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.  వ్యాపారంలో పెట్టుబడులు కలసి వస్తాయి.

మకరరాశి:  ఈ రాశి వారు మే 2026 నెలలో మొఎలాంటి రిస్క్​ తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు.   ఈ సమయంలో, జాగ్రత్తగా వాహనం నడపండి మరియు మీ ఆరోగ్యం మరియు విలువైన వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.  ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి.. సహోద్యోగుల నుంచి  సహకారం ఉండదు.  అయినా సరే చాలా ఓర్పు.. సహనాన్ని పాటించండి. వ్యాపారస్తులకు లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి.  కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది.  ఆస్తి వివాదాల పరిష్కారంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 


కుంభరాశి:  2026 మే నెలలో ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. వీరికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, వారికి ఇది బెస్ట్ సమయం. అయితే వీరు వీలైనంత వరకు స్థిరాస్తి కొనుగోలు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపారస్థులకి ఇది సరైన సమయం. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారు ఈ మాసంలో ప్రయత్నాలు చేయడం చాలా శుభసూచకమని పండితులు చెబుతున్నారు. 

మీనరాశి: ఈ రాశి వారికి 2026 మే నెలలో గ్రహాల స్థానాల మార్పు వలన  కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.  అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వృత్తిపరమైన సవాళ్లు ఉండే అవకాశం ఉంది.  ఆఫీసులో పనిభారం అకస్మాత్తుగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.  కెరీర్ వ్యవహారాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడవద్దని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.